Friday, November 22, 2024

రాకేశ్ కు కన్నీటి వీడ్కోలు..

ఎంజీఎం మార్చురీ నుంచి రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. యాత్రకు అశేష జనవాహినిని త‌ర‌లివ‌చ్చింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లతో సహా ఎమ్మెల్సీలు, ఎంపీలు యాత్ర‌లో పాల్గొన్నారు. అంతిమ యాత్రకు వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, బిఎస్పి మద్దతు పలికారు. వరంగల్ నగరంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య యాత్ర కొనసాగింది. అడుగడుగునా పోలీసులు బలగాలు మోహరించాయి. అంతిమ యాత్రకు హాజరైన కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నేతలు ఘ‌న‌ నివాళులర్పించారు. బీజేపీ విధానాలు, ఆర్పిఎఫ్ పోలీసుల కాల్పులను నిరసిస్తూ నల్లజెండాలతో భారీ ప్రదర్శన‌లు చేశారు. ప్రధాని మోడీ బిజెపికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. వరంగల్ MGM నుండి ధర్మారం, నర్సంపేట అయ్యప్పస్వామి ఆలయం, పాకాల సెంటర్ మీదుగా ఖానాపూర్ మండలం దబీర్ పేట గ్రామం వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగనుంది. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతిమ యాత్రలో యువత స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఖానాపూర్ దబీర్ పేట గ్రామం నందు రాకేశ్ అంతిమక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement