Friday, November 22, 2024

ట్రోఫీకి టీమిండియా వ్యూహాలు.. ఓపెనర్‌ జోడిగా రోహిత్‌ శర్మ, శుభమన్‌ గిల్‌

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఓడించడానికి టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. రోహిత్‌ శర్మతో కలిసి శుభమన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని మాజీ స్పిన్నర్‌ హర్బజన్‌ అన్నాడు. నాలుగు టెస్టుల్లోనూ అతడిని ఓపెనర్‌గా పంపాలని ఈ మాజీ స్పిన్నర్‌ అభిప్రాయపడ్డాడు. హర్బజన్‌ సూచనలతో టీమిండియా రోహిత్‌ శర్మ జోడిగా శుభమన్‌ గిల్‌ ఎంపిక చేసినట్లు అంచనా. ప్రస్తుతం శుభమన్‌ గిల్‌ ఫామ్‌లో ఉన్నాడు. కెఎల్‌ రాహుల్‌ కంటే శుభమన్‌ గిల్‌ జోష్‌లో ఉన్నాడు. ఒక మొదటి టెస్ట్‌లోనే కాదు నాలుగు టెస్ట్‌ల్లో రోహిత్‌ శర్మకు జోడిగా పంపాలని హర్బజన్‌ సూచించాడు. 2020లో ఆసిస్‌పై టెస్టుల్లో గిల్‌ అరగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన అతను 736 పరుగులు చేశాడు.

- Advertisement -

ఈ మధ్యే గిల్‌ మూడు ఫార్మట్లలో శతకాలు బాదాడు. దీంతో రికార్డుల్లో ఎక్కాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్‌ ఆడనున్నాడని తెలుస్తోంది. సిరీస్‌ ఏదైనా ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంపై విజయావకాశాలు ఆధారపడతాయి. ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఓపెనర్‌ జోడి బాగుండాలని టీమ్‌ ఇండియా యత్నిస్తుంది.

స్వదేశంలో ఓటమి లేదు..

దాదాపు 11 ఏళ్లుగా భారత జట్టు స్వదేశంలో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోలేదు. దాంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ఇండియా విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది. విరాట్‌ కోహ్లీ, శుభమన్‌ గిల్‌, పూజారా, కెఎల్‌ రాహుల్‌ తది తరులు ఫామ్‌లో ఉన్నారు. సిరాజ్‌, షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఉనాద్కత్‌తో బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా ఉంది. అయితే స్వదేశంలో టీమిండియా చేతిలో ఓటమిపాలైన ఆసిస్‌ ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement