టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇవ్వాల జరుగుతున్న అత్యంత కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతులెత్తేసింది. అత్యంత టఫ్ ఫైట్ ఉంటుందని అభిమానులు ఎదురుచూశారు. అయితే.. భారత జట్టు పెట్టిన అత్యంత భారీ టార్గెట్ (235)కు.. కివీస్ ఒత్తిడికి గురైనట్టు స్పష్టమవుతోంది. 66 పరుగులకే కివీస్ ఆల్ అవుట్ అయ్యింది. దీంతో భారత్ 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.. టీ20 సిరీస్‌ని 2–1 తేడాతో కైవసం చేసుకుంది.
దీంతో వికెట్లు ఫటా ఫట్ పడేసుకుని ఆటతీరు సరిగా లేక నిరాశ పరుస్తోంది. రెండు ఓవర్లు కూడా పూర్తి కాకుండా 13 పరుగులు చేసి కీలకమైన 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఫిన్ అల్లెన్ (3), కాన్వే (1), మార్క్ చాప్మన్ (0), గ్లెన్ ఫిలిప్స్ (2) పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత శాంతనర్ (13) మిచ్చెల్ కలిసి ఇన్సింగ్స్‌ని గాడిలో పడేసేందుకు ట్రై చేశారు. అయితే.. బ్రేస్‌వెల్ (8), సోధి (0), ఫర్గూసన్ (0), వెంట వెంటనే వికెట్లు కోల్పోయి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మిచ్చెల్ (35), టిక్నర్ కలిసి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
పది ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ మొత్తం స్కోరు 66/10 ..
ఇక.. హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, శివం మావి 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ పడగొట్టారు.