భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో T20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికాగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో గెలుపొందింది.
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ ముందు 236 పరుగుల భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. ఇక, డిఫెండింగ్‌లో భారత బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో.. 9వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది ఆస్ట్రేలియా జట్టు. దీంతో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2–0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీయగా… అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ చరో వికెట్ దక్కించుకున్నారు.
- Advertisement -