- తుది జట్టులో మార్పులు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం అందుకున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఈరోజు చెన్నై వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండటంతో ఇరు జట్లు అమీతుమీ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ చేపట్టనుంది.
జట్టు మార్పులు:
భారత్ రెండు మార్పులు చేసింది. రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి గాయాల కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. దీంతో ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు.
ఇంగ్లండ్ కూడా రెండు మార్పులు చేసింది. గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో జామీ స్మిత్ (అరంగేట్రం), బ్రైడన్ కార్సేలు తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
టీమిండియా : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్.
ఇంగ్లండ్ : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్సే, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్