శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అద్భుతంగా రాణించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. శనివారంనాడు రణ్‌గిరి డంబెల్లా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్లు కోల్పోయి ఇంకా ఐదుబంతులు ఉండగానే 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, గెలుపొందింది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. తాజా విజయంతో టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. ఓపెనర్లు విష్మి గుణరత్నె 45, కెప్టెన్ చమారి ఆటపట్టు 43 పరుగులతో జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. అనంతరం బరిలోకి దిగిన ఎవరూ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. హర్షిత సమరవిక్రమ 9, అన్షుకా సంజీవని 8, ఒసాది రణసింఘె 5, కవిశా దిల్హరి 2, నిలాక్షి డి సిల్వా 1, సుగందిక కుమారి 1 పరుగు మాత్రమే చేశారు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టగా, రేణుకా సింగ్, రాధా యాదవ్, పూజ వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు సృతి మందన 39, సఫాలి వర్మ 17 పరుగులతో రాణించగా, సబ్బినేని మేఘన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 31 నాటౌట్‌గా నిలిచింది. దీంతో ఇంకా ఐదు బంతులు ఉండగా, 5 వికెట్లు కోల్పోయి 127 పరగులు చేసింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక బౌలర్లలో ఒసాది రణసింఘె, ఇనోంకా రణవీర చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సుగందిక కుమారి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో 2-0తో మూడు టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అటు బౌలింగ్‌లో 3 ఓవర్లలో 12 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.