Tuesday, November 26, 2024

Cricket | వన్డే వరల్డ్‌కప్‌ టీమిండియా రాణిస్తుంది: గంగూలీ

డబ్ల్యుటీసీ ఫైనల్‌లో ఓటమి వన్డే ప్రపంచకప్‌ అవకాశాలను దెబ్బతీస్తుందనే వాదనను టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కొట్టిపారేశాడు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌సేన సారథ్యంలోని టీమిండియా తప్పకుండా రాణిస్తుందనే నమ్మకం తకుందన్నాడు. రోహిత్‌ నాయకత్వంలో ముంబై ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిచింది. ఆ తర్వాత ధోనీ మాత్రమే ఈ రికార్డును సమం చేశాడు.

ఐపీఎల్‌ టోర్నీలో విజేతగా నిలవడం సులభమేం కాదు. పద్నాలుగు లీగ్‌ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌ ఆడి చాంపియన్‌గా నిలవాలి. అదే ప్రపంచకప్‌ విషయానికొస్తే నాలుగైదు విజయాలు సాధిస్తే సెమీస్‌కు చేరొచ్చు. అందుకే ప్రపంచకప్‌ గెలవడం కంటే ఐపీఎల్‌ గెలవడమే కష్టమని నా అభిప్రాయం అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో గెలవడం కాదు..: గవాస్కర్‌

మరోవైపు టీమిండియా ఆటతీరుపై సునీల్‌ గవాస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తే సరిపోదని మండిపడ్డాడు. మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియా వంటి మేటి జట్లపై గెలవాలని పేర్కొన్నాడు. వచ్చేనెల నుంచి మనకు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి.

వెస్టిండీస్‌ ప్రస్తుతం బలమైన జట్టుకాదు. మీరు అక్కడికి వెళ్లి ఆ జట్‌ుపై 2-0, 3-0, 5-0 తేడాతో విజయాలు సాధిస్తారు. ఇదేం పెద్ద విషయం కాదు. ఫైనల్స్‌ వరకు మళ్లిd ఆస్ట్రేలియాతోనే ఆడి అవే తప్పులు చేస్తే, ఎప్పుడు ట్రోఫీని గెలుస్తారు? అని గవాస్కర్‌ ప్రశ్నించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement