ముంబై: వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే, టీ-20 సిరీస్‌ల షెడ్యూల్ ఖరారైంది. జులై 22 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా, జులై 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ మొదలుకానుంది. జులై 17న ఇంగ్లండ్ టూర్ ముగించుకుని భారత్ జట్టు నేరుగా వెస్టిండీస్ వెళ్లనుంది. జులై 22న ట్రినిడాడ్ వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్ స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 9:30గం.లకు (భారత్‌లో రాత్రి 7గం.లు) వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు సంబంధించి జులై 29న ట్రినిడాడ్ వైదికగా బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఆగస్టు 1, 2 తేదీల్లో రెండు, మూడవ టీ20 మ్యాచ్‌లు, ఫ్లోరిడా వేదికగా 6, 7 తేదీల్లో నాలుగు, ఐదు టీ20 మ్యాచ్‌లు భారత్- వెస్టిండీస్ ఆడనున్నాయి.
వెస్టిండీస్ స్థానిక కాలమానం ప్రకారం.. 10:30గం.లకు (భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8గంటలకు) మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇకపోతే వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మ్యాచ్‌లు టీవీల్లో ప్రసారం కావు. ఈ టూర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రసార హక్కులను డ్రీమ్ 11కు చెందిన ఫ్యాన్ కోడ్ మొబైల్ యాప్, వెబ్ యాప్‌లో మాత్రమే ప్రసారమవుతాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..