టీమిండియా కోసం రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టీ20 ప్రపంచకప్ విజేతలకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ముంబై రోడ్లపై ఎక్కడ చూసినా జనం దర్శనమిస్తున్నారు. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ కన్నుల పండువగా సాగుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ క్రికెటర్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల మద్దతు, ప్రేమకు ఫిదా అయిపోయిన భారత ఆటగాళ్లు.. ప్రపంచకప్ ట్రోఫీని చూపిస్తూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పరేడ్ మొదలైనా సరే.. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో టీమిండియా విజయోత్సవ ర్యాలీ వాంఖడే స్టేడియం వైపు వెళ్తోంది. వాంఖడే స్టేడియానికి చేరుకున్నాక అక్కడ భారత క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ విజేతలను ఘనంగా సత్కరించనుంది.