2022 ఆసియా కప్‌లో సూపర్ ఫోర్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు సెప్టెంబర్ 4వ తేదీన (ఆదివారం) మరోసారి తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఆగస్ట్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బంతిలో పాండ్యా సిక్స్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా 5 వికెట్ల తేడాతో తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌పై విజయభావుటా ఎగరేసింది. లీగ్ దశలోని రెండో గేమ్‌లో భారత్ హాంకాంగ్‌ను ఓడించి గ్రూప్ A నుంచి సూపర్4 దశకు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. మరోవైపు పాకిస్థాన్ తమ రెండో గేమ్‌లో హాంకాంగ్‌ను 155 పరుగుల తేడాతో ఓడించి సూపర్4కు అర్హత సాధించింది.
కాగా, సెప్టెంబరు 4న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్4 దశలో టీమిండియా, పాకిస్తాన్ జట్లు క్రికెట్ ప్రేమికులకు థ్రిల్ కలిగించేలా ఒకదానితో ఒకటి మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 07:30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ సారి ఏ టీమ్ గెలుస్తుందనే అంచనాల్లో క్రికెట్ ప్రేమికులు ఉన్నారు. తమ దేశం అంటే.. తమ దేశం గెలుస్తుందని పందేలు కాస్తున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (సి), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖదీర్ హస్నైన్, హసన్ అలీ.