టీ 20 ప్రపంచకప్‌లో పరాజయం చెందిన టీమ్ ఇండియా ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే, టీ 20 సిరీస్‌లకు సిద్దమైంది. మూడు టీ 20 సిరీస్‌తో భారత పర్యటన ప్రారంభం కానుంది. టీ 20 జట్టుకు హార్థిక్ పాండ్యా, నాయకత్వం వహిస్తాడు. అలాగే వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇదిలా ఉండగా న్యూజిలాండ్ కెప్టెన్ ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు.
టీ 20 సిరీస్‌లు…
తొలి టీ 20: నవంబర్ 18, వేదిక: వెల్లింగ్టన్
రెండో టీ 20: నవంబర్ 20, వేదిక : బే ఓవల్ , మౌంట్ మాంగనుయ్
మూడో టీ 20: నవంబర్ 22, వేదిక: మెక్ లీన్ పార్క్, నేపియర్
భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి
పాండ్యా నేతృత్వంలో టి 20 టీమ్
హా ర్థిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర, కుల్ దీప్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ శార్
ధావన్ నేతృత్వంలో వన్డే టీమ్..
శిఖర్ ధావన్(కెప్టెన్ ), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ , వికెట్ కీపర్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషిం గ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యజువేంద్ర చాహల్, కుల్ దీప్, అర్షదీప్, దీపక్ చాహర్, కుల్ దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్
మొదటి వన్డే: నవంబర్ 25, వేదిక: ఈడెన్ పార్క్, అక్లాండ్
రెండో వన్డే: నవంబర్ 27, వేదిక: సెడాన్ పార్క్, హమిల్టన్
మూడో వన్డే: నవంబర్ 30, వేదిక: హగ్లే ఓవల్, క్రెస్ట్ చర్చ్
భారత కాలమాన ప్రకారం ఉదయం ఏడుగంటల నుంచి