టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. అయితే తొలి మూడు రోజుల పాటు క్రికెటర్లు కఠిన్ క్వారెంటైన్‌లో ఉండనున్నారు. ప్లేయర్లు ఒకర్ని ఒకరు చూసుకునే వీలు కూడా ఉండదట. ఈ విషయాన్ని క్రికెటర్ అక్షర్ పటేల్ తెలిపాడు. సౌతాంప్టన్‌లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ముంబై నుంచి సౌతాంప్టన్ బయలుదేరిన విమానంలో పురుషుల, మహిళల జట్టు క్రికెటర్లు వెళ్లారు. విమానంలో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోను ఇవాళ బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. జూన్ 18వ తేదీన న్యూజిలాండ్‌తో టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన న్యూజిలాండ్ అక్కడ ఆతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబైలో 14 రోజలు క్వారెంటైన్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్ బయలుదేరింది.
వీడియో: ఇంగ్లాండ్ లో కోహ్లీ సేనకు 3 రోజుల కఠిన క్వారెంటైన్..ఒకరి నొకరు చూసుకునే వీలు లేదంట..!
Advertisement
తాజా వార్తలు
Advertisement