Wednesday, November 20, 2024

ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్​ షురూ చేసిన టీమిండియా.. అశ్విన్‌కు కరోనా, జయంత్‌ యాదవ్‌కు పిలుపు

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇంగ్లండ్‌ చేరుకున్నాడు. భారత క్రికెట్‌ జట్టు సభ్యులతో కలిసి టెస్టు మ్యాచ్‌కు కసరత్తు మొదలెట్టేశారు. జులై 1 నుంచి 5వ తేదీ వరకు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ టీమిండియా ఆడనుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా బెంగళూరులో ఆదివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌ అనంతరం కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, రిషబ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. కోచ్‌ వచ్చీ రాగానే, టీమిండియా క్రికెటర్లతో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ద్రవిడ్‌ కంటే ముందే, ఇంగ్లండ్‌ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ హంబ్రెయ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ నేతృత్వంలో టెస్టు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, చతేశ్వర్‌ పుజారా, శార్దూల్‌ ఠాకూర్‌ తదితరులు నాలుగు రోజుల కిందటే బర్మింగ్‌హామ్‌ చేరుకున్నారు. స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌కు కొవిడ్‌ వైరస్‌ సోకడంతో జట్టు సభ్యులతో కలిసి యూకే వెళ్లలేకపోయాడు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌ చేరుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయ. జూన్‌ 24 నుంచి టీమిండియా నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ నిర్ణీత సమయంలో కరోనా నుంచి కోలుకోని పక్షంలో అతడి స్థానంలో హర్యానా స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌కు స్థానం దక్కనుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూచనల మేరకు బెంగళూరులోని ఎన్‌సీఏ నుంచి జయంత్‌ యాదవ్‌కు పిలుపు వచ్చింది. బుధవారంలోపు రవిచంద్రన్‌ అశ్విన్‌ కొవిడ్‌ నుంచి కోలుకోని పక్షంలో అతడి స్థానంలో జయంత్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌కు వెళ్లి, టీమిండియా జట్టుతో కలవనున్నాడు.

అశ్విన్‌కు కరోనా..

భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కరోనా వైరస్‌ సోకింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అశ్విన్‌ వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమయ్యే అవకాశాలేర్పడ్డాయి. జూన్‌ 24 బుధవారంనాటి లోపు అశ్విన్‌ కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుంటేనే యూకే వెళ్తాడు, లేదంటే టెస్టు మ్యాచ్‌కు దూరమైనట్లే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement