భారత క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా టీవీల్లో ఆ మ్యాచ్‌ను ఆసక్తిగా చూసింది. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్‌లో ఒక టీమిండియా.. ఇటు శ్రీలంకలో మరో టీమిండియా మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కోహ్లి సారథ్యంలోని సీనియర్ టీమిండియా ఇంగ్లండ్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంటే.. ఇటు ధావన్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా శ్రీలంకతో రెండో వన్డేలో తలపడింది.
ధావన్ సేన ఆడుతున్న మ్యాచ్‌ను కోహ్లీ సేన ఆసక్తిగా తిలకించింది. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్, భువనేశ్వర్ జోడీ ఊహించని విజయాన్ని సాధించి పెట్టడంతో అటు ఇంగ్లండ్‌లోని కోహ్లీ సేన ఈ గెలుపును బాగా సెలబ్రేట్ చేసుకుంది. బీసీసీఐ ఈ వీడియోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేసింది. అంతకుముందు ‘టీమిండియా వాచింగ్ టీమిండియా’ అంటూ రోహిత్‌తో పాటు ఇతర ఆటగాళ్లు శ్రీలంకలో భారత్ ఆడుతున్న మ్యాచ్‌ను ల్యాప్‌టాప్‌లో చూస్తున్న ఫొటోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఈ వార్త కూడా చదవండి: రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్