టీమిండియా క్రికెట్‌కు చెందిన హోమ్ సీజన్‌ను బీసీసీఐ విడుదల చేసింది. 2021-22 సీజన్‌లో ఇండియా తన తొలి సిరీస్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. నవంబర్ 17న జైపూర్‌లో కివీస్‌తో టీ20 క్రికెట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక వచ్చే ఏడాది జూన్ 19వ తేదీన సౌతాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్‌తో ఇండియా ఈ సీజన్‌ను ముగించనుంది.
నవంబర్ 17 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌తో జైపూర్, రాంచీ, కోల్‌కతాలో టీమిండియా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత కాన్పూర్, ముంబైల్లో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి టెస్టు నవంబర్ 25 నుంచి 29 వరకు, రెండవ టెస్టు డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరుగుతుంది. అనంతరం వెస్టిండీస్‌తో టీమిండియా హోం సిరీస్ ఆడుతుంది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 9, 12 తేదీల్లో జైపూర్, కోల్‌కత్తాలో మిగితా రెండు వన్డేలు జరుగుతాయి. ఫిబ్రవరి 15వ తేదీన కటక్‌లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. వైజాగ్, త్రివేండ్రంలో 18, 19 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆ తర్వాత శ్రీలంకతో టీమిండియా హోం సిరీస్ ఆడుతుంది. ఫిబ్రవరి 25న శ్రీలంకతో బెంగుళూరులో తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. మొహాలీలో రెండో మ్యాచ్ మార్చి 5వ తేదీ నుంచి జరుగుతుంది. మొహాలీ, ధర్మశాల, లక్నోల్లో మూడు టీ20లు ఉంటాయి. 13, 15, 18 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక జూన్ 9న సౌతాఫ్రికాతో చెన్నైలో తొలి టీ20 ప్రారంభం కానుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. బెంగుళూరు, నాగపూర్, రాజ్‌కోట్, ఢిల్లీల్లో మిగతా టీ20లు ఉంటాయి. జూన్ 12, 14, 17, 19 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరుగుతాయి.