బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడింది టీమిండియా… దీంతో మూడో రోజు ఆట ముగిసేసిరికి 49 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (35) రాణించగా… కెప్టెన్ రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లి (70), సర్ఫరాజ్ ఖాన్ (70) అర్థ శతకాలతో చెలరేగారు. ప్రస్తుతం క్రీజ్ లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. అయితే, టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇక, అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులే చేయగా… న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (134) సెంచరీ చేయగా.. టీమ్ సౌథీ(65) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.