టీమిండియా బౌలర్, కేరళ క్రికెటర్ శాంతకుమరన్ నాయర్ శ్రీశాంత్ (39) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సరైన సమయమిదేనని అభిప్రాయపడ్డాడు. బాగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చాడు.
టీమిండియా తరఫున 27 టెస్ట్‌లు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ మొత్తం 169 వికెట్లు(87 టెస్ట్ వికెట్లు, 75 వన్డే, 7 టీ20 వికెట్లు) పడగొట్టాడు. ఈ వెటరన్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి కనబర్చకపోవడంతో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాలో మిగిలిపోయాడు. శ్రీశాంత్ 50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో మెగా వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..