- ఫైనల్లో చైనాపై ఘన విజయం
- వరుసగా రెండోసారి టైటిల్ కైవసం
మహిళల జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఒమన్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ పెనాల్టి షూటౌట్‌లో 4-2తో చైనాను చిత్తు చేసి వరుసగా రెండో సారి ఆసియా జూనియన్స్ టైటిల్ కైవసం చేసుకుంది.
తొలుత మ్యాచ్ పూర్తి సమయంలో భారత్ 1-1 చైనాలు సమానంగా నిలవడంతో ఫలితం కోసం పెనాల్టి షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. షూటౌట్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుకోవడంతో వుమెన్ ఇన్ బ్లూ విజేతగా నిలిచింది.