Tuesday, November 26, 2024

శవం పక్కన నిలబడి… నవ్వే సైకో జగన్

తిరుపతి ఉప ఎన్నిక దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆదివారం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన లోకేష్ పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు గొర్రెల మందగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వానికి నేను జేసీబీ అని పేరుపెట్టానన్నారు. జే అంటే జగన్‌ ట్యాక్స్‌, సీ అంటే కరప్షన్‌, బీ అంటే బాదుడే బాదుడు అని అన్నారు. జగన్‌ బాదుడుకు ప్రజలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్‌రెడ్డి పేరును సైకోరెడ్డిగా మార్చానన్నారు. ఆయనకు దళితులంటే కోపం అన్నారు.

తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌కు కనీసం అపాయింట్‌మెంటు కూడా ఇవ్వకుండా వేధించారన్నారు. దళితులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన మీడియా ముఖంగా బాధను వ్యక్తం చేశారు. దళిత ఎంపీ చనిపోతే కనీసం నివాళులర్పించడానికి వెళ్లని సైకోరెడ్డి జగన్ అన్నారు. ఆయన సామాజికవర్గం ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే స్పెషల్‌ ఫైట్‌లో వాలిపోయారని ఆరోపించారు. దళితనేత, బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య చనిపోతే అక్కడికి వెళ్లి మృతదేహం పక్కన నిలబడి జగన్‌ నవ్వుతున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement