Friday, November 22, 2024

ఏపీ ప్రజలకు పెట్రోల్ పెంపులే ఉరితాళ్లు అవుతున్నాయి: టీడీపీ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద టీడీపీ నేతలు మహాధర్నాను చేపట్టారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్ పాల్గొన్నారు. వైసీపీ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే రాష్ట్రంలో పెట్రోల్ ధ‌ర‌లు రూ.100 దాటాయని బోండా ఉమా ఆరోపించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

వైసీపీ ప్ర‌భుత్వం ప్రజలపై ప‌న్నులు పెంచుకుంటూ పోతోంద‌ని బోండా ఉమ ఆరోపించారు. ఇప్ప‌టికైనా జగన్ సర్కారు లీటర్‌కు రూ.30 తగ్గించాలని డిమాండ్ చేశారు. మ‌రోవైపు క‌డ‌ప జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జిల్లాలో టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. పులివెందుల ఆర్టీసీ బ‌స్టాండ్ నుంచి ర్యాలీకి బీటెక్ ర‌వి పిలుపునివ్వడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శ్రీకాకుళంలోని కోటబొమ్మాళిలో టీడీపీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ఏపీలో పెట్రోల్ పంపులే ప్రజలకు ఉరితాళ్లు అవుతున్నాయని టీడీపీ ట్విట్టర్‌లో ఓ పోస్టును ఫోటో చేసింది.

ఈ వార్త కూడా చదవండి: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై కేసులు వేసే అధికారం వారికే

Advertisement

తాజా వార్తలు

Advertisement