Tuesday, November 26, 2024

ఆన్‌లైన్‌లో జీవోల ఎత్తివేత అంశంపై గవర్నర్‌ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు

విజయవాడ రాజ్ భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీ టీడీపీ నేతలు కలిశారు. వర్ల రామయ్య, బోండా ఉమ, బచ్చుల అర్జునుడు గవర్నర్ ను కలిసి జీవోల ఆఫ్ లైన్ అంశంపై చర్చించారు. వెబ్ సైట్‌లో జీవోలు ఉంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందిస్తూ, ప్రభుత్వం బ్లాంక్ జీవోలు ఇచ్చేందుకు వీలులేదని స్పష్టం చేశారు. జీవోలను ఆన్ లైన్ లో ఉంచకుండా తేదీ, నెంబరు వేసి వదిలేస్తున్నారని ఆరోపించారు. రాత్రిపూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని వివరించారు. జీవోలు ఆన్ లైన్ లో పెడతారో లేదో చూసి వారం తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. తాము బ్లాంక్ జీవోలపై ఫిర్యాదు చేయగానే ఆన్ లైన్‌లో జీవోలు తీసేశారని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోందన్నారు.

ఈ వార్త కూడా చదవండి: విజయనగరంలో యువతిపై పెట్రోల్ దాడి.. సీఎం జగన్ సీరియస్

Advertisement

తాజా వార్తలు

Advertisement