ఏపీలో ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అక్రమ కేసులు పెడుతోన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలు తెలిపితే గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
పోలీసులు ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించారని వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ నేతల వ్యవహారాలు, వారు చేపడుతున్న చర్యలపై మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను వర్ల రామయ్య కోరారు.
ఈ వార్త కూడా చదవండి: 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు: సీఎం జగన్