ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం మత మార్పిడిలు అజెండాగా పనిచేస్తోందని ప్రముఖ ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ది ఆర్గనైజర్’లో ఓ కథనం వచ్చిందని ఆయన ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ చర్య వల్ల దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందా అని ప్రశ్నించారు. అధికార సాధన కోసం మీరు హిందూ వ్యతిరేక విధానాన్ని పాటిస్తున్నారా అంటూ నిలదీశారు. ఈ మేరకు 13 ప్రశ్నలను సంధిస్తూ వర్ల రామయ్య ఓ లేఖను విడుదల చేశారు.
దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నేతగా జగన్‌ను ‘ది ఆర్గనైజర్’ పత్రిక అభివర్ణించిందని, దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్, అమరావతిలో అత్యంత ఖరీదైన భవనాలు నిర్మించిన మాట నిజమేనా అని నిలదీశారు. బెంగళూరులో అత్యంత విలాసవంతమైన మీ భవనంలో హెలికాప్టర్‌లు దిగే సదుపాయం ఉందా? ఆ భవనంలో 75 గదులు ఉన్న మాట నిజమేనా? అంటూ లేఖలో ప్రశ్నించారు. సీఎం జగన్ చెప్పే సమాధానాల కోసం రాష్ట్ర ప్రజలు వేచిచూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్ పాదయాత్రలో ఈటెల కీలక వ్యాఖ్య