Sunday, November 24, 2024

ఏపీలో మహిళల దుస్థితిపై వంగలపూడి అనిత ఫైర్

ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి ఏపీలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వ చర్యలు నేరస్తులను ప్రోత్సహించేలా ఉన్నాయని అనిత మండిపడ్డారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దాడులపై విచారణ చేసేందుకు ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని జాతీయ మహిళా కమిషన్‌ను లేఖలో కోరారు. కమిషన్ తక్షణ చర్యలు మహిళల్లో విశ్వాసాన్ని కలిగించడమే కాకుండా రాష్ట్రంలో మహిళలపై దాడులను అరికట్టడంలో కూడా సహాయపడుతుందన్నారు.

దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్‌ల ప్రచారం ఏపీ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయని ఆరోపించారు. 9 జూన్ 2021(శనివారం) నాడు కృష్ణా నది ఒడ్డున గల సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద మహిళ వేధింపులకు గురవ్వడం దురదృష్టకర సంఘటన అని, కానీ ఘటన జరిగిన ప్రదేశం సీఎం నివాసం, డీజీపీ, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలో ఉందని గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న చట్టాలను సరిగా అమలు చేస్తే మహిళా రక్షణ కు ఎటువంటి డోకా ఉండదని, కానీ ప్రభుత్వం చేసిందల్లా దిశా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, దిశా మొబైల్ వెహికల్స్ పేరిట వైసీపీ రంగులు వేసుకోవడమేనని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: తాడేపల్లి అత్యాచారం కేసులో ఆస్పత్రి నుంచి బాధితురాలు డిశ్చార్జ్

Advertisement

తాజా వార్తలు

Advertisement