Saturday, November 23, 2024

కరోనా వారియర్స్ ను తొలగిస్తారా?: పట్టాభి

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పై ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కరోనా విధుల్లో ఉన్న వేలాది మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు పెరిగితే… బాధితులకు చికిత్స ఎవరు అందిస్తారని ప్రశ్నించారు. వేలాది మంది విధుల్లో లేకపోతే ఆసుపత్రుల్లో పరిస్థితి ఏమిటని నిలదీశారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని పట్టాభి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఫ్రంట్ లైన్ వారియర్లకు పూలాభిషేకం చేశారని… ఏపీలో మాత్రం వారికి జీతాలు కూడా ఇవ్వకుండా తొలగించారని దుయ్యబట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కోవిడ్ వారియర్స్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించి… వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్ ను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వారికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోగా… విధుల నుంచి తొలగించారని చెప్పారు. కరోనా వారియర్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే… రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని పట్టాభి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement