Thursday, November 21, 2024

కేసుల పేరుతో ఓట్లు వేయించుకుంటారా?

ఏపీలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం బాచుపల్లిలోఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ కాలనీల్లో యువకుల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేస్తున్న యువకులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ ఘటనాస్థలికి బయల్దేరగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించించారు. కేసులు పెడతామని బెదిరిస్తూ వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు లేని వ్యక్తులు ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వన్ సైడ్ గా ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న వైసీపీ వాళ్ళను పోలీసులు ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారని ఆమె ప్రశ్నించారు. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, తమని భయపెట్టాలని చూస్తే రెట్టింపుగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement