Saturday, November 23, 2024

బెయిల్ పై విడుదలైన నల్లమిల్లి

తనకు సంబంధం లేని కేసులో అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు అనపర్తి టి.డి.పి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి . రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన నల్లమిల్లి అనపర్తి టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు వైద్యం అందించకుండా ఒక దేశద్రోహిలా చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతిని బయటపెడున్నానని తనపై కక్షసాధిస్తున్నారని ఆరోపించారు.

కాగా, కొద్ది రోజుల క్రితం రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేశారు. రెండు వర్గాలు ఆలయంలో ప్రమాణం చేశాయి. ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి బావ హత్య అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలపై జరుగుతున్న వేధింపుల్లో భాగంగా ఎవరితో ఒకరితో పిర్యాదు ఇప్పించడం కనీసం దర్యాప్తు లేకుండా అరెస్టు చేయడం కామన్‌గా మారిపోయిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

,

Advertisement

తాజా వార్తలు

Advertisement