రమణ దీక్షితులును మళ్లీ విధుల్లోకి తీసుకునే అంశంపై టీటీడీని ఉద్దేశిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేని పింక్ డైమండ్ మాయమైంది అంటూ కేసు వేసి తిరుమల ప్రతిష్ట మంటగలిపినందుకు విజయసాయిరెడ్డితో పాటు రమణ దీక్షితులుపై కూడా దేవస్థానం పాలకమండలి రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిందని టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వైసీపీ ఒత్తిడితో టీటీడీ ఆ దావాను ఉపసంహరించుకునే ప్రయత్నం చేయగా కోర్టు అభ్యంతరం చెప్పిందని పేర్కొన్నారు. ఎవరిపై అయితే పరువు నష్టం దావా వేశారో ఇప్పుడు వారినే ప్రధాన అర్చకులుగా తీసుకుంటున్నారని.. ఇది విచిత్రంగా ఉంది అంటూ టీడీపీ కామెంట్ చేసింది. కాగా రిటైర్ అయిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ శనివారం టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటుగా మిగతా అర్చకులు కూడా విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement