కుప్పం, డిసెంబర్ 28(ప్రభ న్యూస్ ):తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం కుప్పం లో పర్యటన చేశారు మొదటి రోజు గుడుపల్లి మండలం లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రశాంగిస్తూ కుప్పం నా సొంత ఊరు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని అందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కుప్పం కంచుకోట అని అందులో గుడిపల్లి గుండెకాయలాంటిదని చంద్రబాబు పేర్కొన్నారు.నా లాంటి వ్యక్తికే రక్షణ లేదంటే సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రజలను ప్రశ్నించారు
.ఆంధ్రప్రదేశ్ లో వైసిపి సినిమా అయిపోయిందని ఇంకా 100 రోజులే సమయం ఉందని తెలిపారు.పోలీసులకు కూడా నేనే దిక్కుని ఐదు సంవత్సరాలలో వైసిపి పోలీసులకు ఏమీ చేయలేదని ప్రభుత్వం పని అయిపోయిందన్నారు . ఇంకా పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే పనిచేయాలన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆపరేషన్ ప్రారంభం అయ్యిందని ఆయన తెలిపారు.గత 35 సంవత్సరాలుగా కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారని,కుప్పం నియోజకవర్గంలోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికే కుప్పానికి వచ్చానాని తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో పది లక్షల లీటర్ల పాలు వచ్చేలా చర్యలు తీసుకుంటా, ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకలాను అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రం లో ధరలు విపరీతంగాపెరిగిపోయాయి. మహిళలకు ప్రోత్సాహం అందిస్తా… డీఎస్సీ ఇవ్వలేదు నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన చెందారు. యువతకు పెద్దపీట వేస్తాం ఐదు ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెదేపా శ్రేణులు వంద రోజులు మన కోసం పనిచేస్తే మంచిరోజులు వస్తాయన్నారు .ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ కు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అదోగతే అని తెలిపారు.
రాష్ట్రంలో దేవుని భూములను సైతం అమ్మేస్తున్నారని, ,హంద్రీనీవా నీరు శ్రీశైలం నుండి కుప్పానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసెంది నేనే అని కానీ వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను నీరుగార్చారని తెలిపారు.. రైతులకు సంపద సృష్టించే పథకాలు తీసుకువస్తా ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా దగా చేశారని తెలిపారు. రైతులకు సంవత్సరానికి 20 వేలు ఇచ్చేలా ప్రణాలికలు రచించా మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తా బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తాం. మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నారు 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేస్తున్నారు. నిత్యవసర వస్తువులు, కరెంటు, పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నారు.
. సుపరిపాలన అందజేస్తాను,సంపద సృష్టించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటానాని హామీలు ఇచ్చారు. అదేవిధంగా అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. నిరుపేద కుటుంబాలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆదాయం పెంచుతా ప్రతి ఒక ఇంటికి ఒక ప్రణాలిక. కుప్పం నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య తీరుస్తానాని హామీ ఇచ్చారు.ఐదు ఏళ్లలో నియోజకవర్గంలో ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదు, అలాగే వెంకటాపురంలో జడ్పిటిసీ కృష్ణమూర్తి రైతులపై ప్రతాపం చూపాడు, ఆంబోతులను అణచివేస్తా రౌడీఇజం చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ హెచ్చరించారు.
రౌడీఇజాన్ని పూర్తిగా అణచివేస్తాం ఎమ్మెల్యేలకు దొంగ పనులు నేర్పింది జగన్మోహన్ రెడ్డే కుప్పంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మంత్రిని చేస్తున్న మంత్రిని మారుస్తావా ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, భూములు దోపిడీ, గ్రానైట్ లో దోపిడీలు చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఒక గజదొంగ అరాచకశక్తులను అంతం చేయాలంటే ఇంటికొకరు ముందుకురావాలని ప్రజలను కోరారు.ఉపాధిహామీ వైసిపి కార్యకర్తలకు మేతగా తయారయ్యిందని వందల కోట్లు కొల్లగొడుతున్నారు. రాష్ట్రంలో సెటిల్మెంట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ప్రజలు వీటిని గమనించి రాబోయే ఎన్నికలల్లో వైకాపా బుద్ది చెప్పి ఇంటికి సాగానంపాలని కోరారు. ఈ కార్యక్రమం లో తెదేపా జిల్లా నాయకులు పాల్గొన్నారు.
అంతకు ముందు కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత ఆయన బెంగుళూరు నుంచి నేరుగా కారులో కుప్పం చేరుకున్నారు.. అక్కడ ఆయనకు మంగళ హరతులతో మహిళలు స్వాగతం పలికారు.