ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఇందులో రూ.11,164 కోట్ల ఆదాయం.. ఈ ఆఫర్‌లో పాల్గొన్న ప్రమోటర్ సంస్థ టాటా సన్స్‌కు అందనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కూడా 11.7 లక్షల షేర్లను టెండర్ చేసి రూ.528 కోట్లను రాబట్టుకుంది. రూ.2లక్షల కంటే తక్కువ విలువ చేసే షేర్లు ఉన్న చిన్న వాటాదార్లకు కేటాయించిన రిజర్వ్ విభాగంలో 2.53 కోట్ల షేర్లకు టెండర్లు వచ్చాయి. ఈ విభాగానికి కేటాయించిన 60లక్షల షేర్లతో పోలిస్తే.. 4.22 రెట్ల అధిక స్పందన లభించింది. ఇతర విభాగాల్లోనూ 8.1 కోట్ల అధిక షేర్లకు టెండర్లు వచ్చాయి. బై బ్యాక్‌లో ఒక్కో షేరు రూ.4,500 చొప్పున 4 కోట్ల షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసింది.
బైబ్యాక్ తరువాత టీసీఎస్ టాటా సన్స్ వాటా 72.19 శాతం నుంచి 72.30 శాతానికి పెరిగింది. ఇతర రిటైల్ షేర్ హోల్డర్ల వాటా 27.81 శాతం నుంచి 27.70 శాతానికి తగ్గింది. అలాగే టీసీఎస్ మొత్తం పెయిడ్ అప్ క్యాపిటల్ 3.7 బిలియన్ షేర్ల నుంచి 3.66 బిలియన్ షేర్లకు తగ్గింది. ఇంతకుముందు 2020లో టీసీఎస్ చేపట్టిన రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌లో టాటా సన్స్ రూ.9,997.5 కోట్ల విలువైన షేర్లు టెండర్ చేసింది. ఆ సమయంలో 5.33 కోట్లకు పైగా షేర్లను టీసీఎస్ కొనుగోలు చేయగా.. టాటా సన్స్ నుంచి 3,33,25,118 షేర్లు స్వీకరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..