పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. TC (టికెట్ చెకర్) రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉండగా, లైవ్ వైర్ అతనిపై పడటంతో విద్యుదాఘాతానికి గురై రైల్వే ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు. వార్తా నివేదికల ప్రకారం, ఆ టీటీఈ (ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్) ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలిన గాయాలతో ప్రమాదం నుండి బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన CCTV కెమెరాలో రికార్డ్ అయింది, కాగా ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ప్లాట్‌ఫారమ్‌పై నిలపడి మరో టీటీఈ తో మాట్లాడుతున్నట్లు కెమెరా రికార్డింగ్ లో కనిపస్తోంది. ఉన్నట్టుండి సడన్ గా హైటెన్షన్ వైర్ ఒకటి వెనుక నుండి వచ్చి అతన్ని తాకింది.. దీంతో వెంటనే ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు ఆ టీటీఈ.