Tuesday, November 19, 2024

టాటా చేతికి ఎయిరిండియా

న‌ష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ కోసం స‌మ‌ర్పించిన బిడ్స్‌ను టాటా స‌న్స్ గెలుచుకుంది. దీంతో ఎయిర్ ఇండియాలో 100 శాతం పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించనుంది. 

ఎయిరిండియాను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ క్రమంలో టాటా గ్రూప్​, స్పైస్​జెట్​ సహా పలు ప్రముఖ సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. వాటిలో నుంచి ప్రభుత్వం టాటా గ్రూప్​ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో భారీ న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇక టాటా స‌న్స్ చేతుల్లోకి వెళ్ల‌నుంది.

ఇది కూడా చదవండి: దేశంలో 26 వేలు దాటిన కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement