వాణిజ్య వాహనాల ధరలను టాటా మోటార్స్ పెంచింది. వాహనాలను బట్టి ఈ రేట్ల ను జూల్ 1 నుంచి 1.5 శాతం నుంచి 2.5 శాతానికి పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాహనాల తయారీలో వినియోగిస్తున్న ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం మూలంగానే వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్ తెలిపింది.
ఏప్రిల్‌లో ప్యాసింజర్ కార్ల ధరలను 1.1 శాతం, వాణిజ్య వాహనాల ధరలను 2 నుంచి 2.5 శాతం వరుకు పెంచింది. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి వాణిజ్య వాహనాల ధరలను టాటా మోటార్స్ పెంచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.