Saturday, November 23, 2024

టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

దేశీయ కార్ల కంపెనీ టాటా మోటార్స్‌ తమ కమర్షియల్‌ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు 2శాతం నుంచి 2.5శాతం వరకు ఉండవచ్చని తెలిపింది. ఏప్రిల్‌ 1, 2022 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. మోడల్‌, వేరియంట్‌ ప్రకారం ధరల పెంపు ఉంటుందని టాటా మోటార్స్‌ తెలిపింది. స్టీల్‌, అల్యూమినియంతోపాటు ఇతర విలువైన మెటల్స్‌ ధరలు పెరగడంతో వాణిజ్య వాహనాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో టాటా మోటార్స్‌ తమ కమర్షియల్‌ వాహనాల ధరలను పెంచింది. వచ్చే ఐదేళ్లలో ఈవీ సెగ్మెంట్‌లో రూ.15వేల కోట్లను పెట్టుబడులను పెడుతున్నామని కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలుకు రానున్న కాలంలో పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయాలని కంపెనీ నిర్ణయించిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement