టాటా మోటార్స్ ప్రయాణీకుల వాహనాల ధరలను మే 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలు 0.6 శాతం వరకు పెరుగుతాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల తయారీ వ్యయం పెరగడంతోనే పెంపు తప్పలేదని పేర్కొంది. దీంతో పాటు ముడిసరుకుల ధరలు పెరిగినట్లు తెలిపింది. అనివార్య పరిస్థితుల్లోనే పెరిగిన భారాన్ని కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వచ్చిందని టాటా మోటార్స్ పేర్కొంది.
టాటా మోటార్స్ ప్రయాణీకుల వాహనా విభాగంలో టియాగో, టిగోర్, అల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హా ్యరియర్, సఫారీ వంటి మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు 5.54 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే కంపెనీ వాహనాల ధరలను 1.2 శాతం పెంచింది. తాజాగా మరో 0.6 శాతం పెంచింది.