ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్‌గా గుర్తింపు పొంది బుకింగ్స్ పరంగా రికార్డ్ సృష్టించింది టాటా టియాగో ఈవీ. ఒక్క రోజులోనే 10వేలకు పైగా యూనిట్లు బుక్ అయ్యాయి. ఇక నెల రోజుల వ్యవధిలో బుకింగ్స్ సంఖ్య 20వేలు దాటిపోయింది. ఈ ఈవీ డెలవరీలు ఇటీవలే మొదలయ్యాయి. కాగా, ఇప్పుడు టియాగో ఈవీ ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 8.69లక్షలుగా ఉండేది. అది ఇప్పుడు రూ. 11.99లక్షల వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు వేరియంట్‌పై రూ. 20వేల వరకు పెంచింది టాటా మోటార్స్.
- టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. 1) అవి 19.2కేడబ్ల్యూహెచ్, 2) 24కేడబ్ల్యూహెచ్. మొదటికి 250కి.మీల రేంజ్ ఇస్తుంటే.. రెండోదానికి 315కి.మీల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.
- ఇక తాజా పెంపుతో.. 19.2కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 3.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ఆప్షన్ ఉండే ఎక్స్ఈ వేరియంట్ ధర 8.69లక్షలకు చేరింది. ఎక్స్‌టీ వేరియంట్ ధర రూ.9.29లక్షలకు పెరిగింది.
- 24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ఆప్షన్ ఉన్న ఎక్స్‌టీ వేరియంట్ ధర రూ.10.19లక్షలుగాను, ఎక్స్జెడ్+ వేరియంట్ ధర రూ.10.99లక్షలుగాను, ఎక్స్జెడ్+ టెక్ ఎల్యూఎక్స్ ధర రూ.11.49లక్షలుగాను ఉంది.
- మరోవైపు 24కే డబ్ల్యూహెచ్, 7.2కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ఆప్షన్, ఎక్స్జెడ్+ వేరియంట్ ధర రూ. 11.49లక్షలు, ఎక్స్జెడ్+ టెక్ ఎల్యూఎక్స్ ధర రూ. 11.99లక్షలుగాను ఉంది.