క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 (IPL 2022)లో నేడు మరో ఆసక్తిర పోరు జరగబోతుంది. నేటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్, కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇక ఇరు జట్లు తమ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో తమ విజయాల ఖాతా తెరవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
టీ20 ఫార్మాట్లో ధోని ఇప్పటివరకు 6,985 పరుగులు చేశాడు. మరొక 15 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్లో 7 వేల పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు ధోని. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1617 పరుగులు చేసిన ధోని, ఐపీఎల్‌లో 4,796 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ లీగ్ వంటి ఇతర టీ20 లీగ్‌ల్లోనూ కొన్ని పరుగులు చేశాడు. కుదిరితే, ఈ మ్యాచులోనే ధోని ఈ రికార్డు అందుకునే ఛాన్సు ఉంది.
ఇక, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించేందుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా సరికొత్త చరిత్ర లిఖించేందుకు అతడికి ఒక్క వికెట్ కావాలి. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగబోయే మ్యాచులో బ్రావో ఒక్క వికెట్ తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఈ రికార్డును అందుకుంటాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..