హైదరాబాద్, (ప్రభ న్యూస్) : టాటా హిటాచీ ఖరగ్‌పూర్ ప్లాంట్ నుంచి సరికొత్త ఐదు టన్నుల వీల్ లోడర్ జెడ్డబ్ల్యు225ని విడుదల చేసినట్లు టాటా హిటాచీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ తెలిపారు. జపనీస్ సాంకేతికతతో కూడిన మేడ్-ఇన్-ఇండియా మెషీన్ అన్నారు. మొదటి రెండు మెషీన్‌లను టాటా హిటాచీ కస్టమర్ వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అందజేశామన్నారు. పెట్టుబడిపై రాబడి పరంగా కస్టమర్‌లకు అత్యుత్తమ విలువను అందించడంలో టాటా హిటాచీ నిబద్ధతకు ఉదాహరణ అన్నారు.
అత్యాధునిక వినూత్న సాంకేతికతలతో నిండి ఉందన్నారు. ఇంధన సామర్థంపై రాజీ పడకుండా అసాధారణమైన ఉత్పాదకతను అందించగల సామర్థం కలదన్నారు. యంత్రం ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆపరేటర్ సౌలభ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. టాటా హిటాచీ జెడ్ డబ్ల్యు225 అనేది సీఈవీ-ఐవీ ఉద్గార నిబంధనలకు కట్టుబడి ఉండే కమ్మిన్స్ ఇంజిన్‌తో ఆధారితమన్నారు. పర్యావరణ అవసరాలు, పరిశుభ్రమైన పర్యావరణంపై తమ దీర్ఘకాలిక నిబద్ధతకు ఉదాహరణ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.