టాటా మోటార్స్‌కు చెందిన ఎస్‌యూవీలు హారియర్, సఫారీ కార్లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ సెఫ్టీ టెస్ట్ కు కంపెనీ వాలంటరీగానే ఈ వాహనాలను టెస్ట్ చేయించింది. టాటా సఫారీ, హారియర్ కార్లు 2022 అసెసెమెంట్ ప్రోటోకాల్స్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షించారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ మాదిరిగానే మన దేశంలోనూ త్వరలోనే భారత్ ఎ న్‌క్యాప్ టెస్ట్‌లు ప్రారంభం కానున్నాయి. మన దేశంలో ఈ టెస్ట్‌లు ప్రారంభమైతే, గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టులకు మన దేశ కార్లను పంపించరు.
సెఫ్టీ టెస్ట్‌లో ఫ్రంట్, సైడ్ నుంచి ఏ మేరకు కారు సురక్షితమన్న విషయాన్ని పరీక్షిస్తారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబులిటి కంట్రోల్ (ఈఎస్‌సీ) టెస్ట్ చేస్తారు. పెద్దలు, పిల్లల విభాగంలో సెఫ్టీ ఎలా ఉందన్న దాన్ని స్టార్ రేటింగ్ ఇస్తారు. టాటా సఫారీలో 7 సీట్లతో, హారియర్ ఐదు సీట్ల ఎస్‌యూవీ. ఈ రెండు కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఈఎస్‌సీ సిస్టమ్ ఉంది. పెద్దలు, పిల్లల విభాగం రెండింటినూ ఈ రెండు కార్లు టాప్ రేటింగ్ 5 స్టార్ పొందాయి.
ఈ రెండు కార్లు పిల్లలు, పెద్దలకు కూడా అత్యంత సురక్షితమైనవిగా ఈ టెస్ట్‌లో వెల్లడైంది. 2014లో ఇండియా సెఫ్ కారు కాంపెయన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 65 కార్లను గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్ట్‌లో పరిక్షించారు. ఇందులో 11 టాటా మోటార్స్ కార్లను పరీక్షించారు. ఇందులో నెక్సాన్, ఆల్ట్రోజ్, పంచ్ కార్లు 5 స్టార్ రేటింగ్ సాధించాయి. టాటాకే చెందిన నానో కారు మాత్రం జీరో రేటింగ్ పొందింది. తాజాగా హారియర్, సఫారి రెండు కార్లు 5 స్టార్ రేటింగ్ సాధించాయి.