టాటా మోటార్స్ విద్యుత్ వాహనాల అమ్మకాలు మే నెలలో 66 శాతం పెరిగాయి. మేలో మొత్తం 5,805 ఈవీ వాహనాలు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో 3,505 ఈవీ యూనిట్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. టాటా మోటార్స్ మే నెలలో మొత్తం అమ్మకాలు 73,448 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇవి 74,755 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాల మొత్తం అమ్మకాలు 6 శాతం పెరిగి 45,984 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు కూడా కలిసి ఉన్నాయి.
టాటా వాణిజ్య వాహనాల అమ్మకాలు 11 శాతం పెరిగి 8,160 యూనిట్లుగా ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మాకాలు మాత్రం 38 శాతం తగ్గి, 3,450 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. 2022 మే నెలో వీటి అమ్మకాలు 5,540 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ క్యారియర్ వాహనాల అమ్మకాలు 7 శాతం పెరిగి 3,874 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయంగా వాణిజ్య వాహనాల అమ్మకాలు 12 శాతం తగ్గి 27,570 యూనిట్లుగా నమోదైనట్లు తెలిపింది. టాటా మోటార్స్ 2023 ఏప్రిల్‌లో 6,516 విద్యుత్ వాహనాలను విక్రయించింది. 2022 ఏప్రిల్ అమ్మకాలు 2,333 యూనిట్లతో పోల్చితే ఈ సంవత్సరం అమ్మకాలు 179 శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ తెలిపింది.