Thursday, November 21, 2024

రుచి సోయా ఎఫ్‌పీఓ.. ప్రైస్‌ బ్యాండ్‌ రూ.615-650: రాందేవ్‌ బాబా వెల్లడి

పతంజలి గ్రూప్‌ యాజమాన్యంలోని రుచి సోయా ఇండస్ట్రీస్‌ సోమవారం ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ధరను రూ.2 ఫేస్‌ వ్యాల్యూ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.615-650గా నిర్ణయించామని బాబా రాందేవ్‌ ప్రకటించారు. అసలైన యోగా ధర్మంతో పాటు పారిశ్రామిక ధర్మంలో ముందుకు సాగుతున్నామని, జాతీయ హితానికి ప్రాధాన్యత ఇస్తూ.. రుచి సోయా ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, స్వదేశీ ఉత్పత్తులను అందించడం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎఫ్‌పీఓకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. కనిష్టంగా 21 షేర్ల లాట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఫాస్‌ ్ట మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ), ఫాస్ట్‌ మూవింగ్‌ హెల్త్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంహెచ్‌జీ)లో ఉన్న కంపెనీ మొత్తం రూ.4,300 కోట్లకు ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది.

ఆగస్టులోనే సెబీ అనుమతి..

ఎఫ్‌పీఓ గురువారం, 2022 మార్చి 24న తెరవబడుతుంది. సోమవారం, 2022 మార్చి 28 వరకు సబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం అందుబాటులో ఉంటుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో రుచి సోయా రాబోయే ఇష్యూలో ఉద్యోగుల ద్వారా సబ్‌ స్క్రిప్షన్‌ కోసం 10,000 వరకు ఈక్విటీ షేర్ల రిజర్వేషన్‌ను కలిగి ఉందని తెలియజేసింది. ఆగస్టు 2021లో రుచి సోయా ఎఫ్‌పీఓ ప్రారంభించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతిని పొందింది. గతేడాది జూన్‌లో రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ని దాఖలు చేసింది. లిస్టెడ్‌ ఎంటీటీలో కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 25 శాతం ఉండాలనే సెబీ నిబంధనకు అనుగుణంగా కంపెనీ తన ఎఫ్‌పీఓతో ముందుకు వస్తోంది.

కార్పొరేట్‌ ప్రయోజనాల కోసమే..

డీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. రుచి సోయా మొత్తం ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాన్ని కొన్ని బకాయి లోన్‌లను తిరిగి చెల్లించనుంది. పెరుగుతున్న వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను తీర్చనుంది. సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలను తీర్చడం ద్వారా కంపెనీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగించాలని యోచిస్తోంది. 2019లో పతంజలి గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌- లిస్టెడ్‌ రుచి సోయాను రూ.4,350 కోట్లకు ఇన్వాలెన్సీ ప్రాసెస్‌ ద్వారా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ప్రమోటర్లకు దాదాపు 99 శాతం వాటా ఉంది. ఇది ఈ రౌండ్‌ ఇష్యూలో కనీసం 9 శాతం వాటాను తగ్గించాల్సిన అవసరం ఉంది. సెబీ నిబంధనల ప్రకారం.. కంపెనీ కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 25 శాతం సాధించడానికి ప్రమోటర్ల వాటాను తగ్గించాలి. ప్రమోటర్ల వాటాను 75 శాతానికి తగ్గించడానికి దాదాపు 3 ఏళ్ల సమయం ఉంది. రుచి సోయా ఎఫ్‌పీఓ గురించి స్వస్తిక ఇనెస్ట్‌మార్టులోని సీనియర్‌ విశ్లేషకుడు ఆయుష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఇది పతంజలి గ్రూప్‌ నుంచి బలమైన బ్యాకప్‌ కలిగి ఉందన్నారు. ఇది లాభదాయకంగా మారగలిగిన కంపెనీ అని, ఇది బలమైన ఉత్పత్తి పోర్ట్‌ ఫోలియోను కలిగి ఉందన్నారు. భారతదేశంలోని అతిపెద్ద పూర్తి ఇంటిగ్రేటెడ్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనింగ్‌ కంపెనీల్లో ఒకటని చెప్పుకొచ్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement