దేశంలో మంకీపాక్స్ వ్యాధి గూర్చి నిశితంగా పరిశీలించడానికి, నియంత్రణ కోసం టాస్క్ఫోర్స్ను నియమించినట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వికెపాల్ టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహిస్త్తారు. దీనివల్ల రోగనిర్దారణ సౌకర్యాల విస్తరణతో పాటు ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడానికి దోహదపడుతుంది. మంకీపాక్స్ వ్యాధికి వ్యాక్సినేషన్ గూర్చి అవగాహన పెరగడానికి టాస్క్ఫోర్స్ పని చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
గత వారం కేరళలో 22 ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ సోకి మరణించిన సంగతి తెలిసిందే. జులై 26న ప్రజారోగ్యాన్ని సమీక్షించడానికి ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ నేతృత్వంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.