వరంగల్ , ప్రభన్యూస్: అధిక సంపాదన కోసం వ్యాపారులు సర్కార్ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటు-న్నారు. అక్రమార్జనకు అలవాటు- పడ్డ సరఫరాదారులు పోలీసుల కళ్లుగప్పి దుకాణదారులకు నిరాటంకంగా సప్లయి చేస్తూనే ఉన్నారు. పోలీసుల దాడులతో ఛోటామోటి వ్యాపారులు సైతం బీదర్‌కు వెళ్లి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు రహస్యంగా దిగుమతి చేసుకుంటూ షాప్స్ సరఫరా చేస్తున్నారు. ఆ విధంగా గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
ఆ విధంగా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లులోను గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు సాగుతున్నట్టు- టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ పక్కా సమాచారం అందుకున్నారు. డ్రైవర్‌గా చేసే మూల తేజేశ్వర్(30) ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో 50 ప్యాకెట్ల అంబర్, 6 ప్యాకెట్ల ఆర్ఆర్ నిషేధిత ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 28 వేల విలువ జేస్తుందని అంచనా వేశారు. పోలీసులు మూల తేజేశ్వర్‌ను అరెస్ట్ చేసి, తదుపరి చర్యల కోసం జఫర్‌గఢ్ పోలీసులకు అప్పగించారు.