Wednesday, July 3, 2024

Tariff Hike – జియో బాటలోనే ఎయిట్ టెల్ బాదుడు… టారిప్ పెంపు

జియో బాటలోనే ఎయిర్‌టెల్‌ సైతం తమ మొబైల్ సేవల టారిఫ్‌లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 11-21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందులోభాగంగానే టారిఫ్‌లను పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉందని వివరించింది. ప్రీపెయిడ్‌ సహా పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల ధరలను సైతం సవరించింది.

ప్రీపెయిడ్‌ ప్లాన్లు..

రూ.199 ప్లాన్: గతంలో రూ. 179 ధర ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు రూ.199. ఇందులో 2GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
రూ.509 ప్లాన్: ఇంతకుముందు రూ. 455, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.509. ఇది 6GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
రూ.1,999 ప్లాన్: గతంలో రూ. 1799, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.1,999. ఇందులో 24GB డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
రూ.299 ప్లాన్: ఇంతకుముందు రూ. 265, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.299. ఇది రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 28 రోజుల పాటు వస్తాయి.
రూ.349 ప్లాన్: గతంలో రూ. 299, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.349. ఇందులో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
రూ.409 ప్లాన్: ఇంతకుముందు రూ. 359, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.409. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 28 రోజుల పాటు అందిస్తుంది.
రూ.449 ప్లాన్: గతంలో రూ. 399, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.449. ఇందులో రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
రూ.579 ప్లాన్: ఇంతకుముందు రూ. 479, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.579. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలను ఇస్తుంది.
రూ.649 ప్లాన్: గతంలో రూ. 549, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.649. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
రూ.859 ప్లాన్: ఇంతకుముందు రూ. 719, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.859. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
రూ.979 ప్లాన్: గతంలో రూ. 839, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.979. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల పాటు రోజుకు 100 SMSలు వస్తాయి.
రూ.3,599 ప్లాన్: ఇంతకుముందు రూ. 2,999, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.3,599. ఇది రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 365 రోజుల పాటు లభిస్తాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement