Friday, November 8, 2024

తార‌క‌ర‌త్న కోలుకుంటున్నారు.. హీరో క‌ల్యాణ్ రామ్

న‌టుడు..త‌న సోద‌రుడు తార‌క‌ర‌త్న కోలుకుంటున్నార‌ని హీరో క‌ల్యాణ్ రామ్ తెలిపారు. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వడానికి తాను మెడికల్ ఎక్స్ పర్ట్ ను కాదని అన్నారు. ఎక్స్ పర్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో తారకరత్న త్వరగానే పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం తనకుందని చెప్పారు. తన తాజా చిత్రం ‘అమిగోస్’ విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కల్యాణ్ రామ్ ఈ మేరకు స్పందించారు. కాగా తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆయన కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement