ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్గా తపన్ కుమార్ డేకాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూర్ స్పెషల్ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దీప్తి ఉమాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా అర్వింద్ కుమార్ను నియమించింది.
అధికార బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు పదవీకాలం ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్గా సమంత్ కుమార్ గోయల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.