ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. . ఆగస్టు 1న టాంజానియాకు చెందిన వ్యక్తి దార్ ఎస్ సలామ్ టాంజానియా నుండి అడిస్ అబాబా, దోహా మీదుగా ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా.. ఎయిర్ పోర్టులో అనుమానంతో పట్టుకున్నామని అధికారులు తెలిపారు.
విచారణలో భాగంగా.. డ్రగ్స్‌తో కూడిన 63 క్యాప్సూల్స్‌ను మింగినట్లు ఆ వ్యక్తి అధికారుల ముందు అంగీకరించాడు. అతన్ని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుండి 63 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. ఈ క్యాప్సూల్స్‌ను శరీరం నుంచి తీసినప్పుడు అందులో 998 గ్రాముల తెల్లటి పౌడర్ కనిపించింది. సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వ్యక్తులు ఈ పౌడర్ ను మత్తుమందుగా గుర్తించారు. ఈ క్రమంలో . దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. క్యాప్సూల్‌లో తెల్లటి పౌడర్ కొకైన్ అని విచారణలో తేలింది. ఈ 998 గ్రాముల కొకైన్ విలువ రూ.14.97 కోట్లు అని కస్టమ్స్ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం.. ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి మత్తుపదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.