ప్రభన్యూస్, హైదరాబాద్: టమాటా ధర మళ్లీ పెరిగింది. కొంతమంది దుకాణాదారులు కిలో రూ.60కిపైగా అమ్ముతున్నారు. ఇంకొందరు రూ.50కి విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో రూ.45 చొప్పున ఇస్తుండగా.. కాలనీల్లోని చిల్లర వ్యాపారులు ధర పెంచి అమ్ముతున్నారు. ధరల పెరుగుదలకు ప్రధానం ఈమథ్య కురిసిన వర్షాలేననే తెలుస్తోంది. పంట నష్టంతో దిగుబడులు తగ్గగా, హైదరాబాద్ నగరానికి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఎక్కువగా టమాటా దిగుమవుతు అవుతోంది. దీనికితోడు పెరిగిన డీజిల్ ధరలతో కూడా రవాణా చార్జీలతో కలిపి కూరగాయల ధరలపై ఎఫెక్ట్ పడుతోంది.
ధరలు పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నగరానికి అవసరమైన 60 శాతం బయట నుంచే వస్తుండగా.. మిగతా 40 శాతమే మన రాష్ట్రంలో లభ్యమవుతోంది. వర్షాలు పడడంతో అమాంతం 15 శాతానికి సరఫరా పడిపోయింది. దీంతో 85శాతం వరకు ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.