Tuesday, November 26, 2024

మళ్లీ పెరుగుతున్న టమోటా ధరలు

వర్షాలకు టమోటా పంట దెబ్బతినడంతో ధరలు భారీగా పెరిగాయి. మెట్రో నగరాల్లోని రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.72 వరకు ధర పలుకుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు టమోటా ఎక్కువగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పంట చాలా దెబ్బతిన్నది. డిమాండ్‌ మేరకు మార్కెట్‌కు సరుకు రాకపోవడంతో ధరలు పెరిగాయి. నెల రోజుల క్రితం కోల్‌కతాలో రూ.38 ధర పలికిన టమోటాను మంగళవారం రూ.72కు అమ్మారు. అంటే నెలలో ధర రెట్టింపు అయింది.

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమోటా రూ.30 నుంచి రూ.57కు, చెన్నైలో రూ.20 నుంచి రూ.57కు, ముంబైలో రూ.15 నుంచి రూ.53కు పెరిగింది. పంట నాణ్యత,స్థానికతను బట్టి ధరలు పలుకుతున్నాయి. ఢిల్లీలోని అజాద్‌పూర్‌ మండి ఆసియాలోనే అతిపెద్ద పండ్లు, కూరగాయాల హోల్‌సేల్‌ మార్కెట్‌. నెల రోజుల్లో ఇక్కడ టమోటా ధరలు రెట్టింపు కాగా దిగుమతులు సగానికి తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక నుంచి టమోటా ఎగుమతి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement