తమిళనాడు సీఎం పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన.. తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన డీఎంకే అధినేత స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన,.. ‘మరింత మెరుగైన తమిళనాడు కోసం మీ సలహాలు, సూచనలు, సహకారం నాకు అవసరం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. పాలనలో విపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో నాకు తెలుసు’ అని అన్నారు. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించి, పాలనా పగ్గాలను అందించేందుకు గవర్నర్ కార్యాలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే 125 సీట్లల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించగా.. అన్నాడీఎంకే 65 సీట్లతో సరిపెట్టుకుంది.
తమిళనాడు సీఎం పదవికి పళనిస్వామి రాజీనామా
By ramesh nalam
- Tags
- breaking news telugu
- Edappadi K Palaniswami
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- RESIGNED
- tamilnadu cm
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement